Monday 2 February 2009

శ్రీరామ సేన చేసింది తప్పా..? నేను అది తప్పు కాదు అంటాను!!!

మన భారత దేశం లొ స్త్రీ కి ఉన్న గౌరవం అంత - ఇంత కాదు --- అది నేను పురాణాల గురించి అంటున్న మాట!
ప్రస్తుత పరిస్టితిల్లొ ఆ యొక్క నానుడి అక్షరాల తప్పు.... ప్రపంచం లోని సాటి భారతీయుడిగా ఏకీభవించక పోవచ్చు కాని, ఈ మధ్య జరిగిన సంఘటన - అదె ఆంగ్లం లో MORAL POLICING BY RAMA SENA .. http://deccanherald.com/Content/Jan272009/editpage20090126114780.asp ని చూడండి .

ఇప్పుడు అందరిదీ ఒకే మాట. స్త్రీలను కొట్టడం తప్పు అని, వారికి తాగే హక్కులేదా అని, మగవారు తాగగా లేనిది.. ఆడవారు తాగితే తప్పేంటని, మగవారు తిరగగా లేనిది ఆడావారు తిరిగితే తప్పేంటని. నిజమే, మగవారికి ఒక న్యాయం ఆడవారికి ఒక న్యాయం సమ్మతం కాదు. ఈ విషయాన్ని, ఆదర్షవంతులైన మగవారు, అదర్షవంతుల్లాగా నటించే మగవారు, స్త్రీవాదులు, మహిళా సంఘాలు గొంతెత్తి చెబుతున్నారు. --- ఈ భారతదేశ్ యువత చేయవలసిన పనేనా?? .

మొన్నామధ్య మెరుగైన సమాజం కోసం ఏర్పడిన TV9 చూస్తున్నప్పుడు, ఒక మహిళామండలి అధ్యక్షురాలు, పబ్బులకి వెల్లడం అశ్లీలంగా వుండే దుస్తులు వేసుకోవడం తప్పైతే, దాన్ని నిరసించే మార్గాలు వేరే వున్నాయని, సంస్కృతి పరిరక్షన పేరుతో స్త్రీలమీద చేయి చేసుకోవడం అనాగరిక చర్య అని అన్నారు. అక్షరలక్షలు విలువ చేసే మాటే అది. కాకపోతే....

సారా కొట్లో తాగుతున్నారని, ఆడవాల్లందరు గుంపులుగా వెల్లి, మగాల్లను కర్రలతో చితక్కొట్టినప్పు, ఈ నీతులన్నీ ఏమయ్యాయబ్బా..?

సారా తాగడం నేరం కాదు, నైతికంగా తప్పు అంతే? మరి వారినికొట్టే హక్కు మన నారీ శిరోమణులకు ఎవరిచ్చారబ్బా? వార్తా పత్రికల వారు, TV ఛానెల్ల వారు ఈ విషయాన్ని గొప్పగా చూపిస్తూ, వారిని నేటి స్త్రీలని, ఆదర్ష స్త్రీలని ఎందుకు పొగుడుతారో...?

స్త్రీవాదులు, ముఖ్యంగా మగ స్త్రీవాదులు వారిని పొగిదేవిధానం, (వీరి మీద ఆడ స్త్రీవాదులు కొంచెం బెటర్లెండి) చేసె ఓవర్ యాక్షనుకి అంతుండందు. ఎందుకనో...?


కాకపొతే ఈ పనిని అందరూ ఆమొదిస్తారు, పొగుడుతారు, కానీ ఇదే మగాళ్ళు ఆడవాళ్ళ్లని కొడితే మహాపరాదం జరిగిందని చెబుతారు. ఇంకా పురుషాధిఖ్య భావజాలం నషించలేదని, మగవాల్లు పురుషాహంకార పందుల్లాగా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోస్తారు.

ఇంతేనా, ఈవ్ టీజింగులు చేసే మగవారిని కొన్నిచొట్ల, అండర్‌వేర్‌తో ఊరేగించిన సందర్బాలున్నాయి. వారుచేసేది( ఈవ్ టీజింగ్) తప్పుకాదని ఎవ్వరూ అనరు కానీ, ఈ బట్టలూడదీసి ఊరేగించే ఓవర్ యాక్షను గురించి మాత్రం ఎవ్వరూ ఎందుకు మాట్లాదరెందుకని? తప్పో ఒప్పో, ఈలాంటి ఓవర్ యాక్షను ఆడవాల్లొ, లేదా ఆడవాల్లని సమర్దిస్తూమగవాల్లొ చేసినప్పుడు మాత్రం ఈ అభ్యుధయవాదులు, మానవహక్కుల గురించి ప్రష్నించే వాల్లు ఎక్కడ దాక్కుంటారో ఎవ్వరికీ అర్థం కాదు.

మరి మన నారీ శిరోమణులు చేసేవి తప్పుకానప్పుడు, శ్రీరాం సేన వారు చేసింది తప్పేలా అయ్యింది? అభ్యుదయవాదులకి, మగస్త్రీవాదులకి, అందరికీ నేనుచెప్పేది ఒక్కటే, దయచేసి ఇలాంటి ఓవర్ యాక్షను ఎవరు చేసినా ఖండించడి, ఆడవారైనా సరే, మగవారైనా సరే...

Edit: My sincere apologies to the originator of this content (part of it) and I give all credits to http://aritaku.blogspot.com/
(I have posted the above from an email that I got forwarded)

2 comments:

Anonymous said...

hi i don't know who you are... but please give me some credit if you directly "copy & paste" the article from other blog.

any way my aim is spreading the message. Except that little thing, i don't mind this.

Unknown said...

Dear Srikanth
I haven't seen your blog until this comment is posted, part of above content was forwarded to me who suggested me to blog.
..sorry